Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
రంగారెడ్డినగర్ డివిజన్ గిరినగర్‌లో ముస్లిం శ్మశాన వాటిక ప్రధాన రహాదారి మూలమలుపు వద్ద ప్రమాదభరితంగా విద్యుత్ వైర్లు పొంచి ఉన్న ప్రమాదం అనే శీర్షికన శుక్రవారం నవ తెలంగాణ దిన పత్రికలో ప్రచురితమైన వార్తకు విద్యుత్ అధికారులు ప్రాగాటూల్స్ సబ్ డివిజన్ ఏఈ నరేంద్ర నాయక్ స్పందించారు. వెంటనే సిబ్బందిని పిలిపించి ఫ్యూజు బాక్స్ విద్యుత్ స్తంభానికి బిగించి మరమ్మతులు చేశారు. పక్కనే ఉన్న ప్రధాన ట్రాన్స్ఫార్మర్ వైర్లను మీదికి లేపి కట్టేశారు. పాదచారులు, వాహనదారులు ఈ సందర్భంగా నవతెలంగాణ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. ఏసమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే సత్వరమే చర్యలు తీసుకుంటామని ఏఈ నరేంద్రనాయక్ వివరణ ఇచ్చారు.