Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నాలుగు గంటల లాక్డౌన్ సడలింపు సమయం సరుకు రవాణా, దుకాణాలకు, కూరగాయల మార్కెట్లకు ప్రజలు కొనుగోలు చేయడానికి సరిపోవడం లేదని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సమయాన్ని పెంచాలని దాని ద్వారా ప్రజలకు, వ్యాపారులకు వెసులుబాటు కలుగుతుందన్నారు. శుక్రవారం ఓయూలోని తన క్వార్టర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓయూలో ఉద్యోగస్తులు కరోనాతో పిట్టల్లా రాలిపోతున్న ప్రాథమిక వైద్య కేంద్రంలో ఒక్క ఇంజక్షన్ లేదని, కనీసం టెస్టింగ్ కూడా చేయడం లేదన్నారు. వెంటనే ఉస్మానియా విశ్వ విద్యాలయ ఆరోగ్య కేంద్రానికి టెస్టింగ్స్తో పాటు ఇంజక్షన్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా ఆవరణలో ఉన్న ఆర్టీసీ హాస్పిటల్లో 200 బెడ్స్ ఉన్నాయని, అందులో 100 బెడ్స్‌ను ఐసోలేషన్ సెంటర్ మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో దక్షిణ భారత రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ కన్వీనర్ శివ పాల్గొన్నారు.