Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్ధరాత్రి మెటర్నిటీ ఆస్పత్రికి గర్భిణి తరలింపు
- ప్రత్యేకంగా అభినందించిన సీపీ అంజనీకుమార్
నవతెలంగాణ-సిటీబ్యూరో
లాక్డౌన్ నేపథ్యంలో నగరంలో రవాణావ్యవస్థ స్తంభించింది. ఆటోలు, క్యాబ్లేకాదు చివరకు అంబులెన్స్‌లు సైతం కరవయ్యాయి. ఈ పరిస్థితిలో ఓ మహిళా అర్ధరాత్రి గాంధీనగర్ పోలీసులను ఆశ్రయించింది. ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులు స్పందించారు. మహిళ ప్రాణాలను కాపాడారు. న్యూ బోయిగూడలో లక్ష్మి అనే ఇద్దరు మహిళలు పక్కపక్క ఇండ్లల్లో నివాసముంటున్నారు. ప్రవీణ్ భార్య లక్ష్మి గర్భవతి. అయితే ఈనెల 12న రాత్రి 11:30గంటల సమయంలో ప్రవీణ్ భార్య లక్ష్మికి ఆకస్మాత్తుగా పురిటినొప్పులొచ్చాయి. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లు, క్యాబ్‌లు, కార్లతోపాటు ఇతర వాహనాల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే లాక్డౌన్ ఉండడంతో కార్లు, క్యాబ్‌లు రాత్రి సమయంలో లభించలేదు. ఏం చేయ్యాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని గమనించిన పక్కింట్లో ఉన్న లక్ష్మి అనే మహిళ వెంటనే గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్‌హెచ్‌వో ఎన్.మోహన్‌రావుకు విషయాన్ని చెప్పింది. వెంటనే స్పందించిన ఎస్‌హెచ్‌వో ఎన్.మోహన్‌రావు, హెడ్‌కానిస్టేబుల్ ఎస్.చంద్రశేఖర్, కానిస్టేబుల్ ఎస్.ఎం.గౌత్ రాజ్, మీరావలీని ఇన్నోవా కారిచ్చి బాధిత మహిళ ఇంటికి పంపించారు. అప్పటికే తీవ్రంగా బాధపడుతున్న సదురు మహిళను కారులో ఎక్కించుకుని కింగ్‌కోఠీలోని మెటనెటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్‌తో మాట్లాడి ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న నగరపోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఇన్స్పెక్టర్(ఎస్‌హెచ్‌వో) మోహన్రావుతోపాటు కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్‌శాఖకు మంచిపేరు తీసుకొని రావడంతోపాటు విధిల్లో నిర్ణక్ష్యం చేయకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించారని సీపీ ప్రశంసించారు. శుక్రవారం వారికి కమిషనరేట్‌లో మెమోంటోను అందించారు. సీపీ చేత ప్రశంసలు పొందడంతోపాటు సీపీ చేతుల మీదుగా మెమోంటోను అందుకోవడం ఆనందంగా ఉందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.