Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావు నగర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అన్నపూర్ణ భోజన కేంద్రాలు పేదల ఆకలిని తీరుస్తున్నాయని కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ వారాంతపు సంత సమీపంలో ఉచిత భోజనం కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానికులతో కలిసి భోజనం చేశారు. అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాప్రా సర్కిల్ ప్రాజెక్టు అధికారిణి ఇందిరా, టీపీసీసీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మానవ హక్కుల సంఘం ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షుడు తాడూరి గగన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.