Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
ప్రజలు కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సురక్ష సేవా సంఘం అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ అన్నారు. శుక్రవారం అబ్దుల్లాపూర్ మెట్ గ్రామపంచాయతీ పరిధిలోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో ఇటీవల కరోనా బారిన పడిన సుమారుగా 27 మంది కుటుంబ సభ్యులకు హ్యాండ్ ఆప్ హోప్, సురక్ష సేవ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎండీ యూసఫ్, సత్యన్నారాయణ, ఎండీ అన్ను, ఎస్ కె హమీద్ పాషా, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.