Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రంజాన్ పర్వదినాన్ని శుక్రవారం నగరంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఉంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలంగాణలో లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. మసీదుల్లో భౌతిక దూరం పాటిస్తూ.. ప్రార్థనలు నిర్వహించారు. ఇక టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం.హుస్సేనీ ముజీబ్ కూడా రంజాన్ పండుగను పురస్కరించుకుని కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా తన ఇంట్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని ఉద్యోగులను ఆయన అభ్యర్థించారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించాలన్నారు. తరుచూ చేతులను శుభ్రం చేసుకోవడంతో పాటు జాగ్రత్తలు పాటించాలని కోరారు.