Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాతబస్తీ, ఎర్రగడ్డతోపాటు పలు ప్రాంతాల్లో హైదరాబాద్ సీపీ పర్యటన
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో రంజాన్ పండుగ వేడుకలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ముస్లిమ్ సోదరులు ఇంట్లోనే ఉండి వేడుకులను జరుపుకోవాలని నగరపోలీస్ కమిషనర్ అంజనీకుమార్ విజ్ఞప్తులతో వారు ఇండ్లల్లోనే ప్రార్థనలు పూర్తి చేశారు. మరో వైపు లాక్‌డౌ అమల్లో ఉండడంతో కమిషనర్ పాతబస్తీ, ఎర్రగడ్డతోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించారు. మూడోరోజు లాక్డౌన్ పరిస్థితిని సమీక్షించారు. లాక్డౌన్లో మినహాయింపు ఇచ్చిన వారు తప్ప అనవసరంగా రోడ్ల మీదికి రావద్దన్నారు. నగరంలో 16వేల పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని, పోలీస్ అధికారులు 9 గంటలకే విధుల్లో ఉంటున్నారన్నారు. సామూహిక దూరం, లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తేనే కేసుల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇండ్లలోనే ఉన్న వారికి సీపీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనవసరంగా బయటికి వస్తే చర్యలు తప్పవని అంజనీకుమార్ హెచ్చరించారు. సీపీతోపాటు అదనపు సీపీ డీ.ఎస్.చౌహాన్, డీసీపీ గజారావుభూపాల్ తదితరులు పాల్గొన్నారు.