Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
ఎల్బీనగర్లో మరిన్ని ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని జెడ్సీ కార్యాలయం ప్రక్కన జీహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్న హోం ఐసోలేషన్ కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి వచ్చి హాస్పిటల్లో చికిత్స పొందలేని నిరుపేద ప్రజలకోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హోమ్ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నామని, ఉచిత వసతి, భోజనం, మందుల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. దాదాపు 100 మందికి చికిత్స అందిస్తామని పేదప్రజలు వీటిని ఉపయోగించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఉప కమిషనర్లు సురేందర్ రెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు.