Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట/అల్వాల్
జీహెచ్ఎంసీ పరిధిలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. భార్యతో గొడవపడితో ఒకరు, బ్యాంకు రుణం ఇవ్వలేదని మరొకరు ఉరేసుకుని బలవన్మరణం పొందారు. అంబర్‌పేట ఎస్‌హెచ్ ఓ బిట్టు మోహన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం భాను ప్రకాష్(40), జ్యోతి దంపతులు గోల్నాక శంకర్‌నగర్‌లో నివాసముంటున్నారు. భాను కారు డ్రైవర్‌గా, జ్యోతి ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. అయితే ఈనెల 13వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భాను ప్రకాష్ ఇంటి లోపలికి వెళ్లి గడియ పెట్టుకొని ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. ఇది గమనించిన అతని భార్య జ్యోతి స్థానికులను పిలిపించి తలుపు కొట్టి చూడగా, అతడు కొన ఊపిరితో ఉన్నాడు. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించే లోగా అతను మరణించాడు. ఎస్ఐ సాల్ వేరు మల్లేశం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బ్యాంకు రుణం ఇవ్వలేదని..
బ్యాంకు రుణం ఇవ్వలేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచ్చ బొల్లారం డివిజన్ చేతన హౌసింగ్ సొసైటీలో మాసాని శ్రీనివాస్ రెడ్డి (40) నివాసముంటున్నాడు. తన ఇంటి పై అంతస్తు నిర్మాణం కోసం బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రుణం ఇవ్వడానికి వారు నిరాకరించడంతో మనస్తాపం చెంది తన ఇంటిపై కప్పుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసున్నాడు. బాధితుడి భార్య స్పప్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.