Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చ ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్ ఆధ్వర్యంలో శనివారం కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులకు అల్ఫాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హైద రాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్‌రావు, సి.వినోద్‌యాదవ్ కొందరు రోగుల బందువులకు ఆల్ఫాహారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనాతో ఎంతో మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ సమయానికి భోజనం దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారిని ఆదుకునేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంద న్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రభుత్వం ఉచితంగా భోజనం పంపిణీ చేయాలనీ, ఆస్పత్రుల ఆవరణలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.