Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్యాలయం పరిధిలోని బాసురెగడి గ్రామంలోని ప్రతి గల్లీలో శనివారం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని శనివారం టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా నాయకులు మరేపల్లి సుధాకర్ పిచికారీ చేయి ంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అవగా హన కలిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విధించిన 10 రోజుల లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. ప్రతి ఒక్కరూ మస్కులు ధరించి శానిటైజర్లు వాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి సుధాకర్, గుండె ఎల్లయ్య, కుండ భానుచందర్, శ్రీధర్, భాస్కర్, గుగిల్లా సారయ్య, రవి పాల్గొన్నారు