Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కరోనా నేపథ్యంలో పేషంట్ దగ్గర డబ్బులు దండుకుంటూ బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీఎల్ఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ డాక్టర్ వాళ్ళం వల్లం నవీన్ కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనాతో బాధపడుతున్న పేషంట్లను కార్పొరేట్ హాస్పిటల్స్ రిటర్న్ ఆదాయం చూస్తున్నాయన్నారు. ఇలా దోచుకునే ప్రయత్న ంలో ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రూ.700 విలువ గల పల్స్ ఆక్సిమీటర్‌ను రూ.3 వేలకు విక్రయిస్తున్నారని తెలిపారు. కరోనా పేషెంట్‌ను హాస్పిటల్‌కి చేర్చడానికి అంబులెన్స్‌లు రూ.లక్షలు వస్తున్నా యని తెలిపారు. రూ.2,750 రెమిడిసివిర్‌ను రూ.60వేలకు విక్రయి స్తున్నారని తెలిపారు. రోగుల నిస్సహాయ స్థితిని ఆదాయ వనరుగా చూస్తున్న కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఇలా చేస్తున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించాలని కోరారు. వ్యాక్సిన్ కేంద్రాల్లో అధిక సమూహాన్ని నియంత్రించడానికి, ఎన్నికల సమయంలో మీరు ప్రజలకు ఓటరు స్లిప్‌లను ఎలా పంపిణీ చేశారో అలాగే కరోనా వ్యాక్సిన్ స్లిప్‌లను జారీ చేయాలని సూచించారు. కరోనాను నియంత్రించడానికి గ్రౌండ్ వర్క్ చేయడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జి వ్యక్తులను నియమించాలని పేర్కొన్నారు.