Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావు నగర్
మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్, రాజీవ్‌నగర్, నవో దయ నగర్, కైలాసగిరి కాలనీల్లో శనివారం ఫీవర్ సర్వే నిర్వ హించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభు దాసు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసు కున్నారు. కరోనా పాజిటివ్ ఉన్న వారిని రెస్ట్ చేసుకోవాలి సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నా, లేక జ్వరం వచ్చిన వారికి అవసరమైన సూచనలు సలహాలు ఇస్తూ సమాచా రాన్ని సేకరించినట్టు ఆయన తెలిపారు. కరోనా టెస్ట్‌లు చేయించుకున్న వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జైపాల్, అశోక్, యాదగిరి, లింగం, ఐలయ్య జీహెచ్ఎంసీ సిబ్బంది జవాన్ యాదగిరి, ఎస్ఎఫ్ఐ యకస్వామి, లష్మి నర్సయ్య, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.