Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
పేదల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ కె.ఎల్ మహేంద్రనగర్ దివ్యాంగుల కాలనీలో 150 కుటుంబాలకు శనివారం సుధాకర్, నాగేంద్రబాబుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కౌ న్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ రెండో దశ లాక్ డౌన్‌తో వికలాంగులు ఉపాధి లేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని తెలిపారు. ఇలాంటి వారి కోసం దాతలు ముందుకు వచ్చి అండగా నిలవాలని కోరారు. ఈ కార్య క్రమంలో కాలనీ అధ్యక్షుడు అన్వర్ పాషా, నాయకులు దాసరిబాబు, రాంబాబు, చౌదరి, సోను, యాదగిరి, తిరుపతి పాల్గొన్నారు.