Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
అకాలంగా ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ళ పరిధిలోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఐడీపీఎల్ నుంచి జగద్గిరిగుట్ట ప్రధాన రహదారి అజ్బెస్టాస్ రోడ్డుపై సుమారు ఫీటున్నర వరకు వర్షపు నీరు స్తంభించి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.