Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
డాక్టర్ ఏఎస్రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి డివిజన్ పరిధిలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను దష్టిలో ఉంచుకొని ప్రతి కాలనీ, ప్రతిగల్లీ, ప్రతి ఇంటికీి హైడ్రోక్లోరిక్ విన్ ద్రవ్యాన్ని, శానిటేషన్ పిచికారి చేశారు. టీపీసీసీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, సోమన్న సైన్యం సహకారంతో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఐదు వాహనాలలో గల్లీ గల్లీ శానిటేషన్ కార్యక్రమాన్ని ఆదివారం జమ్మిగడ్డలోని 16 కాలనీలలోని అన్ని వీధు లలో స్వయంగా హైడ్రోక్లోరిక్ విన్ ద్రవ్యాన్ని పిచికారి చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. డివిజన్ అభివద్ధితో పాటు డివిజన్ ప్రజల యోగక్షే మా లు కూడా తమకు ముఖ్యమని అన్నారు. జీహెచ్ఎంసీ యంత్రాంగానికి తోడుగా డివిజన్ పరిధిలో తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాహనాలు ఎల్లవేళలా డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటాయి అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ధైర్యంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తమను సంప్రదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, నాయకులు ఎస్.ఏ రహీం, గగన్, తిరుమలయ్య, అల్లూరయ్య, హరిబాబు, రమేష్, ప్రసాద్, రామ్ రెడ్డి, సలీం తదితరులు పాల్గొన్నారు.