Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
భారతీయ జనతా పార్టీ డాక్టర్ ఎ.ఎస్.రావునగర్ డివిజన్ ఆధ్వర్యంలో శ్రేయ హాస్పిటల్, తాత హాస్పిటల్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ప్రయివేటు ఆసుపత్రులు మానవీయ విలువలను కాలరాసి ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేయడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ, విజిలెన్స్ విభాగం, పోలీసు శాఖ అందరూ స్పందించాలి. కొరోనా రోగులు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తేనే చేర్చుకోవడం జరుగుతున్నది. ఇన్సూ రన్స్ ఉన్నాకూడా ఆసుపత్రుల యాజమాన్యాలు పట్టించుకోకుండా ఉన్నాయి. ఒక్క రోజు బెడ్డుకు 50,000 తీసుకుంటున్నారు. మెటర్నిటీ చిన్న, చిన్న ఆసు పత్రులు కొవిడ్ ఆస్పత్రులుగా అవతారం ఎత్తుతు న్నాయి, ఆక్సిజన్ లేకున్నా కూడా, కమిషన్ ఏజెంట్ల ద్వారా వ్యాపారం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ దందా చేస్తున్నారు. రోగి బంధువులు బయట ఇంజక్షన్లు మందులు తీసుకోవాలని యాజమాన్యాలు ప్రోత్సహిస్తు న్నాయి, బిల్లును చెల్లించే క్రమములో సర్వం కోల్పోతున్నారు, చివరికి బ్రతికినా, చనిపోయినా కూడా అట్టి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. శవాన్ని అప్పగించే క్రమంలో కూడా లక్షలు చెల్లిస్తే కానీ పార్థివ దేహాలను బంధువులకు ఇవ్వడం లేదు. ఇప్పటికి అయినా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ప్రజలకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు రమేష్ యాదవ్, బీజేపీ మేడ్చల్ జిల్లా (అర్బన్) కార్యదర్శి అంబటి వెంకట చెలం, శరత్ చంద్ర, రొయ్యల చిత్తారి, రాంసాని ప్రభాకర్ రెడ్డి, మద్ది శ్రీకాంత్ రెడ్డి, బీజేవైఎం నాయకులు సునీల్, వాసు, అనుభవు, మంజూరు, అమర్నాథ్, మహేశ్వర్ పాల్గొన్నారు.