Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
రాజకీయ నాయకుల మాటలన్నీ నీటి మూటలే అనే నానుడికి భిన్నంగా మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి జాగతి అభ్యుదయ సంఘం వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని పలువురు రాజకీయవేత్తలకు స్పూర్తిగా నిలిచారు. ఇటీవల తన డివిజన్ మన్సూరాబాద్‌లోని ''మొదటి ముద్ద'' వద్ద జాగతి ఘనంగా నిర్వహించిన పిచ్చుకగూళ్ళ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా విచ్చేసి సంఘం చేస్తున్న కార్యక్రమాలను అభినందిస్తూ, తనవంతుగా రూ.10వేల విరాళాన్ని జేఏసీకి ప్రకటించారు. ఆ మొత్తాన్ని సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్‌కు కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి తానే స్వయంగా ఫోన్ చేస,ి తన నివాసానికి పిలిపించుకుని వారికి చెక్కును అందజేశారు. రాజకీయ నాయకుల మాటలు నిలబెట్టుకునేవి కాదులే, అనే సహజ భావనతో మిన్నకున్న శ్రీనివాస్ ఇప్పటివరకు కార్పొరేటర్ ప్రకటించిన విరాళం గురించి ఆయనను అడగలేదు. కానీ ఊహించని విధంగా వారే పిలిచి ఇవ్వడంపట్ల కతజ్ఞతలు తెలియపరిచారు. బాగుపడనున్న భవిష్యత్ రాజకీయాలపట్ల ఆశాభావాన్ని,హర్షాన్ని వ్యక్తం చేశారు.