Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కరోనా నేపథ్యంలో అవసరమైన బాధితులకు వారికి సహాయం చేయడంలో వీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ దూసుకుపోతోంది. ఇంటిల్లపాది కరోనాతో బాధపడు తున్న వారి గురించి స్వయంగా తెలుసుకుని చారిట బుల్ ట్రస్ట్ ఉచిత భోజనం అందజేస్తోంది. మొదటి దశలో కూడా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసి శభాష్ అనిపించుకున్నారు. ఈ రెండో దశలో కూడా వీఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నవీన్ వల్లం, అతని కుమారుడు మాస్టర్ హరిహరన్ ప్రత్యేక దష్టి సారించి బాధితులకు భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు వారు నిరుపేదలకు సేవ చేయడానికి ముందు ఉన్నారు. వారు పేద కోవిడ్, ఒంటరి రోగులకు ఆహార పంపిణీని ప్రారంభించారు.
ఏఎస్ రావునగర్ :
కోవిడ్ బాధపడుతున్నవారికి కమలా నగర్ నివాసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పలుస హరినాథ్‌గౌడ్ ఆకలి తీరుస్తున్నారు. కరోనా బాధితులు భోజనం గురించి పడే బాధలతో చలించి స్నేహితుల ఆర్థిక సహాయం తో బాధితులకు నైంటీ ప్లస్ ప్రోటీన్ ఆహారం. (గ్రుడ్డు, చికెన్) అందించి వారి ఆకలి తీరుస్తున్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం దాదాపు 40 కిలో మీటర్లు కమల నగర్ కుషాయిగూడ, నాగార్జున నగర్, ఏఎస్ రావు నగర్, కాప్రా, వంపుగూడ, సైనిక్‌పురి తదితర ప్రాంతాలకు వెళ్ళి దాదాపు 150 మందికి భోజనం ఇస్తు అలాగే అవసరమైన వారికి మందులు అందిస్తూ సలహా సూచనలు ఇస్తున్నారు. వారిని కలిసి వారి సేవకు అభినందనలు తెలియజేయడం జరిగింది.
కరోనా బాధితులకు భోజన సరఫరా ఉప్పల్‌లో :
కరోనా మహమ్మారి సోకి హోమ్ ఐసోలేషన్‌లో ట్రీట్మెంట్ చేసుకుంటున్న పేషెంట్స్‌కు రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు ఆధ్వర్యంలో భోజనం పంపిణీ ఐదవ రోజులో భాగంగా ఆదివారం రామంతపూర్ డివిజన్లో పలు కాలనీలలో భోజనం అందజేసిన బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డివిజన్ ప్రెసిడెంట్ బండారు వెంకటరావు, ప్రధాన కార్యదర్శులు, సంకురీ కుమారస్వామి, వులుగొండా నారాయణ దాసు, దయాకర్‌రెడ్డి, వేముల తిరుపతయ్య, సంతోష్ గుప్తా, శైలేందర్, పార్రి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, ఈ ప్రభాకర్ పాల్గొన్నారు