Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
పారిశుధ్య సమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులకు ఆదేశించారు. ఆది వారం కేపిహెచ్బీ డివిజన్‌కు సంబంధించిన కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో పాటు స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు, జీహెచ్ఎంసీ అధికారులతో టెలి కాన్ఫరేన్స్ నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్లో 90 శాతం పనులు పూర్తయిన సందర్భంగా కాలనీ వాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీలో దోమల బెడద, వీధిలైట్లు తదితర సమస్యలను కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి కాలనీలో శానిటేషన్ విధిగా నిర్వహించాలన్నారు. త్వరలో రెండవ దశ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వస్తుందని, వ్యాక్సినేషన్ సెంటర్లు కూడా పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఏదైనా లక్షణాలు ఉన్న యెడల మెడికల్ ఎమర్జెన్సీ కోసం 040 21111111 కు ఫోన్ చేస్తే మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంటాయన్నారు.