Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఇప్పటి వరకు ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాలకు మారు పేరు అయిన వైఎం సిఎ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోమారు తన సామాజిక స్ఫూర్తిని చాటు కుంది. దానిలో భాగంగా సికింద్రాబాద్లోని వైఎంసిఎలో యునైటెడ్ వే హైదరాబాద్, సేల్స్ ఫోర్స్, యూనికప్స్ హెల్త్ ఫౌండేషన్ వారి సహకారంతో'' సంజీవని కోవిడ్ ఐసోలేషన్ సెంటర్''ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను ఎంఎల్సి రాజేశ్వర్రావు ప్రారంభించారు. ఇలాంటి ఆరోగ్యపరమైన, క్లిష్టమైన పరిస్థితిలో ఇక్కడ కారోన నివారణకు చర్యలు చేపట్టడం హర్షణీయం అన్నారు. అందరూ వీరి స్పూర్తితో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక్కడ 50 రూములలో అనుభవజ్ఞులైన ముగ్గురు వైద్యులు, నర్సులు, వారికి సహాయకులు ఏర్పాటు చేశామని వైఎంసిఎ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు జయకర్ దానియల్ చెప్పారు. వైద్య సదుపాయంతో పాటుగా మెడిసిన్స్, ఆహార సదుపాయాలు ఏర్పాటు చేసిన్నట్లుగా ఆయన చెప్పారు. ఎవరైనా కారోన పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఉంటే తమ సెంటర్కు వచ్చి వైద్యసేవలు పొందవచ్చు అని ఆయన సూచించారు. ఇలాంటి సమయంలో అందరూ కలిసికట్టుగా కారోన పై పోరాటం చేయాలని, దాని నివారణకు తోడ్పాటు అందించాలని దానియల్ కోరారు. మరిన్ని వివరాలు సెల్ 7075919375 సంప్రదించాలని సూచించారు.