Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
మేడ్చల్ జిల్లా ఉన్నతాధికారులు సహకరిస్తే తన సొంత ఖర్చులతో ఉప్పల్ నియోజకవర్గంలో 100 పడకల కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తానని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బండారు లక్ష్మారెడ్డి అన్నారు. సెంటర్లోని వందమంది రోగులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు భోజన ఖర్చులు బీఎల్ఆర్ ట్రస్ట్ నుంచి భరిస్తానని పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ అవసరం ఎంతో ఉందని, సెంటర్ ఏర్పాటుకు జర్నలిస్టులు సైతం తగు సూచనలు చేయాలని కోరారు. కరోనా విపత్కర పరిస్థి తుల్లో సమాచార సేకరణ కోసం నిరంతరం పాటుపడుతున్న జర్నలిస్టులందరికీ ఆరోగ్య బీమా ప్రీమియం, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద కావాల్సిన మొత్తాన్ని తను చెల్లిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వెంకట్ రామ్ రెడ్డి, ప్రధానకార్యదర్శి నరోత్తం రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు సాగర్, ఏవీ శ్రీధర్ రావు, ఎం సురేష్, కోశాధికారి యాదగిరి, సహాయ కార్యదర్శి శేఖర్, శివాజీ, కార్యనిర్వాహక కార్యదర్శి ఎం అశోక్, ముఖ్య సలహాదారులు చంద్రమౌళి, టి సురేష్, కంచు శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, కోడికంటి శ్రీనివాస్, శ్రీహరి, శ్రీశైలం, రాజు పాల్గొన్నారు.