Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పెండింగ్‌లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ అన్నారు. సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర హౌసింగ్ సోసైటి కాలనీవాసులతో స్థానిక కార్పొరేటర్ హేమలత సురేష్‌రెడ్డితో కలిసి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర హౌసింగ్ సోసైటీిలో రూ.24.50 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించుకుంటున్న సందర్భంగా ఎమ్మెల్యే కాలనీ వాసులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాలనీలో పార్కు అభివృద్ధి, అంతర్గత భూగర్భ డ్రైనేజీ పనుల మరమ్మతులు, కుక్కల బెడద, వీధి లైట్ల సమస్యను కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కెసిఆర్ , మంత్రి కెటిఆర్ సహకారంతో ఎన్‌ఆర్‌డిపి పథకం ద్వారా మంజూరైన రూ.90 కోట్ల నిధులతో ఫాక్స్‌సాగర్ కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఎక్కడ రాజీ పడకుండా కాలనీలో ప్రణాళిక బద్దంగా మౌలిక వసతులు కల్పించి పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నామన్నారు. కరోనా తీవ్రత తగ్గిన వెంటనే కాలనీలో పర్యటిస్తామని, తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే సంబంధిత అధికారులకు చేరవేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బస్వరాజ్, చెన్నయ్య, శ్రీనివాస్, హరి, రమణరెడ్డి, నాగేందర్‌గౌడ్, సరోజ, సుధాకర్‌రెడ్డి, సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
లాక్డౌన్ కారణంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలను కట్టు దిట్టం చేస్తూ ప్రజల సంరక్షణ కోసం సైబరాబాద్ పోలీసులు నడుం బిగించారు. ఇందులో భాగంగా ఆదివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, బాలానగర్ జోన్ డీసీపీ పద్మజారెడ్డి నేతృత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుచిత్ర, దూలపల్లి , మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని ఆల్వాల్ చెక్ పోస్టులను ఏసీపీలతోపాటు ఆయా సీఐలతో కలిసి పరిశీలించారు.