Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
మేడ్చల్-మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పన్నాల హరీష్‌రెడ్డి పిలుపు మేరకు కరోనా బాధితులను మానవత్వం లేకుండా ప్రయివేటు హాస్పిటళ్ళు బిల్లుల పే రుతో నిలువు దోపిడీ చేయడాన్ని నిరసిస్తూ కూకట్పల్లి అనుపమ ఆస్పత్రి ఎదుట డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి, నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సం దర్భంగా బీజేవైఎం రాష్ట్ర నాయకులు కుమార్ యాదవ్ మాట్లాడుతూ కరోనా పేషంట్లకు అవసరం లేకపోయినా ఐసీయూలో అడ్మిషన్లు చేస్తూ వైద్య పరీక్షల పేరుతో నిలు వు దోపిడీ చేస్తున్నారన్నారు. ప్ర్రయివేటు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు కుమ్మక్కై కరోనా ఉన్నట్టు రిపోర్టులు ఇస్తున్నారనీ, ఇలాంటి ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్ల గుర్తి ంపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అరికట్టాలన్నారు. కరో నాను ఆరోగ్యశ్రీలో చేర్చి రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథ కాన్ని అమలు చేసి కరోనా వైద్య ఖర్చుల నుంచి సామాన్య ప్రజలను విముక్తి చేయాలని కోరారు. రెమిడేసివర్ ఇంజె క్షన్లు ఎమ్మార్పీ ధరలకే ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుని బ్లాక్‌లో అమ్ముతున్న వారిపైన కఠిన చర్యలు తీ సుకోవాలన్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో కరోనాకు ఆరోగ్య బీమాను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి విజిత్, ఉపాధ్యక్షులు రామరాజు, డివిజన్ నాయకులు నర్సింగ్ యాదవ్, రఘు, శ్రీకాంత్, రాజు, మనోజ్, రమేష్, అంజి, తదితరులు పాల్గొన్నారు.