Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
కరోనా చికిత్స పేరిట ప్రయివేటు ఆస్పత్రులు అడ్డగో లుగా వసూలు చేస్తున్నాయనీ, దీన్ని అరికట్టాలని అల్వాల్ పట్టణ కేంద్రంలో మేడ్చల్ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చ అధ్య క్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులను కాదని ఇషా ్టరాజ్యంగా వసూలు చేస్తున్నాయన్నారు. కనీసం రూ.లక్ష అడ్వాన్స్ కడితేనే పేషెంట్‌ను చేర్చుకుంటున్నారనీ, లేదంటే బెడ్స్ ఖాళీగా లేవనే సాకులు చెప్పి గేటు దగ్గరి నుంచే వెనక్కి పంపిస్తున్నారని తెలిపారు. ఆక్సిజన్ అవసరం ఉన్న పేషెంట్ విషయంలో కార్పొరేట్ ఆస్పత్రులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఆక్సిజన్‌తో ట్రీట్మెంటై తే కనీసం రోజుకు రూ.రెండు లక్షలు ఫీజు వసూలు చేస్తు న్నారని తెలిపారు. మరోవైపు హెల్త్ ఇన్సూరెన్స్లకు ట్రీట్మె ంట్ లేదనీ, ముందు ఫీజు చెల్లించి తర్వాతనే రీయింబర్స్ మెంట్ పెట్టుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని తెలి పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రయివేటు, కార్పొరేట్ ఆస్ప త్రుల ఆగడాలపై వేలాది ఫిర్యాదులు వస్తున్నా రాష్ట్ర ప్రభు త్వం మాత్రం కదలిక లేదన్నారు. ఇప్పటిదాకా ఏ ఆస్పత్రి పై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని లేదంటే రానున్న రోజుల్లో బీజేపీ ఆ ధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు, నిరసనలు చేస్తా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజైవైఎం నాయ కులు దినకరన్, ప్రకాష్, నవీన్, వంశీ, ప్రసాద్, మురళి, శివ, నాయుడు, భరత్ పాల్గొన్నారు.