Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినియోగదారుల హక్కుల సంస్థ గ్రేటర్ హైదరాబాద్ మహిళా వింగ్ అధ్యక్షురాలు జి.అనిత
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా పట్ల ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని వినియోగదారుల హక్కుల సంస్థ గ్రేటర్ హైదరాబాద్ మహిళా వింగ్ అధ్యక్షురాలు జి.అనిత అన్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆదివారం సీఆర్ఓ మహిళా విభాగం టీం కొవిడ్-19 వ్యాప్తిపై అవగానా కా ర్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎస్ సదన్ ధోబీ ఘాట్ క్రాస్ రోడ్డులో 500 మాస్కులను పంపిణీ చేశారు. అనంతరం అనిత మాట్లాడుతూ సమిష్టి కృషి, సహకారం తోనే కరోనాను అంతం చేయగలమన్నారు. తప్పనిసరిగా మాస్కలు ధరించాలనీ, భౌతికదూరం పాటించాలనీ, చేతు లను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. కొవిడ్-19 రూల్స్ తప్పకుండా పాటించాలనీ, లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలని కోరారు. అవసరం ఉంటే తప్ప బటయకు రావొద్దని సూచించారు. ఉదయం లాక్డౌన్ సడలింపు సమయంలో గుంపుగుంపులుగా ఉండొద్దనీ, మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో భౌతికదూరం తప్పకుండా పాటించాల న్నారు. మాస్కు, శానిటైజర్‌ను తప్పకుండా వెంట ఉండేలా చూసుకోవాలన్నారు. లాక్‌డౌన్‌తో రోజువారి కూలీలు, అనాథలు, పేదులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ మహిళా వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీ, వైస్ ప్రెసిడెంట్ రేణుక, జనరల్ సెక్రెటరీ కవిలత, సెక్రెటరీలు తులసి, ఇర్ఫానా సుల్తానా, శిరీష, తదితరులు పాల్గొన్నారు.