Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైబరాబాద్ సీపీ సజ్జనార్
- వాహనాల కదలికలు పరిశీలన
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి రాజీవ్ రహదారిలో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సూచించారు. లాక్డౌన్ ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు పరిశీలిచారు. ఈ సందర్భంగా ఆదివారం వాహనాల కదలికల ను సీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ రెండో దశ కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉండవద్దన్నారు. తేలికపాటి లక్షణాల తో బాధపడుతున్న వారిలో చాలా మంది ఇబ్బందిలో కరోనా వైరస్ కావొచ్చని తేలికగా ఆలోచిస్తున్నారని తెలి పారు. ఎలాంటి లక్షణాలున్నా లేకపోయినా బయట తిర గొద్దని సూచించారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో తాము కూడా ఒక ఐసోలేషన్ వార్డు ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. సైబరాబాద్ నుంచి ఐదు వేల మంది పోలీసు అధికారులు ఉన్నారనీ, వారు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. కరోనా మహమ్మారి ఇంకా బలంగా ఉన్నందున చాలా అప్రమత్తం గా ఉండాల్సిన అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు. లాక్డౌన్ ఆదేశాలను స్వచ్ఛందంగా అనుసరించాలన్నారు. మైదానంలో ఉన్న పోలీసులు అందరికీ సాయం చేయడా నికి ప్రయత్నిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు.