Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
ఓ వ్యక్తి తన ఫ్రెండునే సిమెంట్ ఇటుకలతో కొట్టి హత్య చేసిన సంఘటన నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరసింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం... వినాయకనగర్ పరిధి అనంతనగర్ కాలనీలో ఈస్ట్ కపా అపార్టుమెంట్లో శ్యామ్‌సుందర్ (31) తన తల్లి రేణుకతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇదే కాలనీలో చైనా బజార్ వెనకాల ఉన్న విజయ అపార్టుమెంట్లో నివాసముంటున్న నవీన్(33) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ ఫ్రెండ్స్. తరచూ మద్యం సేవిస్తూ గొడవడుతూ ఉండేవారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి నవీన్ శ్యామ్ సుందర్ ఇంటికి వెళ్లి తలుపులు కొట్టాడు. శ్యామ్‌సుందర్ బయటకు రాగానే వాగ్వాదానికి దిగాడు. అయితే ఆ వచ్చిన వ్యక్తి శ్యామ్‌సుందర్ ఫ్రెండ్ అని అతని తల్లికి తెలియదు. గొడవ పడుతుండటాన్ని చూసి కంగారు పడి చుట్టుపక్కలవారిని పిలిచింది. ఎవరూ బయటకు రాలేదు. ఇంతలో నిందితుడు నవీన్ తన వెంట తెచ్చుకున్న కర్రతో శ్యామ్‌సుందర్‌పై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకలు తీసుకుని తలపై కొట్టాడు. దీంతో శ్యాంసుందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే నవీన్, శ్యామ్‌సుందర్ ఫ్రెండ్స్ అని తెలియని శ్యామ్‌సుందర్ తల్లి గుర్తు తెలియని వ్యక్తి తన కొడుకును హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి పోలీసులు వివరాలు సేకరించారు. చుట్టుపక్కల సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కేసు దర్యాప్తులో నవీన్‌ను అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని విచారించగా అసలు సంగతి తెలిసింది. శ్యామసుందర్ మద్యం సేవించి తరచూ బూతులు తిట్టేవాడని, దీంతో అతనిపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని హత్య చేసినట్లు నిందితుడు నవీన్ అంగీకరించాడు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ శివకుమార్ పరిశీలించారు.