Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాలుగు నెలలకే డ్రెయినేజీ కోసం తవ్వకాలు
రాకపోకలకు తీవ్ర అంతరాయం
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
టీఆర్ఎస్ సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టారాజ్యంగా పాలిస్తున్నారని సంజీవయ్యనగర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ సంజీవయ్యనగర్ చౌరస్తా ఇరువైపులా లింక్ సీసీ రోడ్డు వేసి నాలుగైదు నెలలు కాకముందే డ్రెయినేజీ పైపులైన్ల కోసం తవ్వకాలు ప్రారంభించారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు రాత్రి వేళల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటు న్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల ముందు లక్షలాది రూపాయాలు వెచ్చించి సీసీ రోడ్డు వేసినా కూడా అది మూడునాళ్ళ ముచ్చటగా మారిపోయిందిని వాపోయారు. ప్రజా ప్రతినిధులు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కమీషన్లకు కక్కుర్తిలో నిమగమయ్యారని స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
దీనికి తోడు అధికారులు సైతం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పనుల్లో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిస్తే ఇప్పటికి తమ ప్రాంతానికి వచ్చిన పాపాన పోలేదని స్థానిక ప్రజలు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించాలని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.