Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
పేదలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్ అన్నారు. మంగళవారం కాచిగూడ డివిజన్ పరిధిలోని నిరుపేదలకు ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా నిరుపేదలు ఇబ్బందిపడుతు న్నారని, వారి కోసం నిత్యఅన్నదానం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు రమేష్ యాదవ్, శ్రావణ్ యాదవ్, నర్సింగ్ యాదవ్, సుభాష్ పటేల్, భీమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.