Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీ మహేష్ భగవత్
నవతెలంగాణ-మలక్‌పేట్
ప్రతి ఒక్కరూ కోవిడ్ రూల్స్ పాటించాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. మంగళవారం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని దిల్సుఖ్నగర్ నుంచి ఫ్రూట్ మార్కెట్, కూర గాయల మార్కెట్ మీదుగా సిబ్బంది, గుర్రపు స్వారీలతో కలిసి మార్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడు తూ... మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రజలకు సూచించారు. లాక్డౌన్ ప్రారంభమైన 12వ తేదీ నుంచి 17వ తేదీవరకు రాచకొండ పరిధిలో 12, 394 కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదు చేశామన్నారు. మూడువేల మంది సిబ్బందితో 46 చెక్‌పోస్టుల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. కార్యక్ర మంలో ఎల్బీనగర్ ఏసీపీ, చైతన్యపురి సీఐ రవికుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.