Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డనవతెలంగాణ -ఎల్బీనగర్
ఎల్.బి నగర్ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేట్ రెసిడెన్షి యల్ కాలేజీలను, స్కూళ్లను వెంటనే ఐసొలేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలనీ ఎల్.బి నగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో నియోజక వర్గ కార్పొరేటర్లతో కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. సామ రంగారెడ్డి మాట్లాడుతూ .. రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా మహమ్మారి జీవితాలను, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో తీవ్ర కరోనా లక్షణాలు గలవారిని చేర్చుకుంటున్నప్పటికీ స్వల్ప లక్షణాలు గలవారు ఇళ్లల్లోనే హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని ప్రభుత్వం సూచించింది. కానీ ఇదే కరోనాను మరింత విజంభించడానికి కారణమవుతోందని అన్నారు. ఎల్బీనగర్ సర్కిల్ వలస కార్మికులు, పేదలు అధికంగా ఉండే ప్రాంతం, కేవలం ఒకే ఒక్క రూములో నలుగురు, అయిదుగురు కుటుంబ సభ్యులు ఉండే కుటుంబాలే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఎల్బీనగర్ సర్కిల్లో ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజిలను ఐసోలేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అని సామ రంగారెడ్డి జోనల్ కమిషనర్‌కు వివరించారు. కార్పొరేటర్లు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, కొప్పుల నరసింహ రెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, లచ్చి రెడ్డి చింతల అరుణ సురేందర్ యాదవ్ మరియు బండారి భాస్కర్ , దయాకర్ తదితరులు పాల్గొన్నారు