Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని డి పోచంపల్లి, సాయి పూజ కాలనీలో మంగళవారం మేడ్చల్-మల్కాజి జిల్లా అడిషనల్ కలెక్టర్ డి.జాన్ శాంసన్ ఫీవర్ సర్వే కార్య క్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ కోవిడ్ లక్షణాలతో ఉన్న వారిని గుర్తించి వారికి కోవిడ్ మెడికల్ కిట్ ఇచ్చారు. దుండిగల్ మున్సిపాల్టీలో మొత్తం 22,730 కుటుంబాలకు సర్వే పూర్తికాగా, 56 మందిలో కోవిడ్ లక్ష ణాలను గుర్తించి వారికి కోవిడ్ మెడికల్ కిట్స్ ఇచ్చారు. మొదటి రోజు నుంచి ఏడో రోజు వరకు వారి ఇంటికి వెళ్లి విచారించి వ్యాధి తీవ్రతను తెలుసుకోవాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. మున్సిపల్ ఆఫీస్, కరోనా కాల్ సెంటర్, హెల్ప్ డెస్క్ ( ఫోన్ నెంబర్.9542715377) పని తీరును పరిశీలించారు. దుండిగల్ మున్సిపాలిటీ పరి ధిలో ఎవరైనా కరోనా లక్షణాలతో ఉన్న వారు ఉంటే ఈ కాల్ సెంటర్‌కి ఫోన్ చేసి కోవిడ్ టెస్ట్ సెంటర్ వివరాలు, కోవిడ్‌తో హౌం ఐసొలేషన్ ఉండే వారు హెల్త్ ప్రాబ్లంతో ఇబ్బందులు పడేవారు ఈ కాల్ సెంటర్ ఫోన్ చేయవచ్చు ననీ, ఈ హెల్ప్ లైన్ 24/7 పని చేస్తుందని తెలిపారు. దుం డిగల్ మున్సిపాలిటీలో రెండు కరోనా-19 (ఓపీ) హెల్త్ సెంటర్స్‌ను, (దుండిగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బౌరం పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్) ఉన్నాయని తెలిపారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, వాళ్ళు నొప్పులతో భాదపడేవారు ఈ సెంటర్స్‌ను సంప్రదించాల నీ, చెకప్ చేసిన తర్వాత అక్కడే మెడికల్ కిట్ అందిస్తారని చెప్పారు. అందరికీ థర్మల్ స్క్రీనింగ్, ఫీవర్ టెస్ట్, ఆక్సిజన్ శాతం తెలుసుకుంటారని తెలిపారు. ఫీవర్ లక్షణాలు ఉన్న వారి వివరాలను సేకరించి వారిని స్థానిక ఆరోగ్య కేంద్రం దుండిగల్ వద్ద కరోనా టెస్ట్‌కు పంపిస్తారని తెలిపారు. కరోనా ఉన్న వారి వివరాలను సేకరించి వారికీ ప్రభుత్వం వారు అందించే మెడికల్ కిట్ అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పి.భోగిశ్వర్లు, ఆశా వర్కర్స్, మహిళా రీసోర్స్ పర్సన్స్, బిల్ కలెక్టర్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.