Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్/కూకట్పల్లి
కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రతి రోజూ ప్రతి డివిజన్లోని అసోసియేషన్ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వ హిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంగళవారం బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో పాటు అసోసియేషన్ సభ్యులు, ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భం గా అసోసియేషన్ సభ్యులు ప్రధానంగా బాలానగర్ డివిజ న్లో కొన్ని ప్రాంతాల్లో మ్యాన్ హౌల్స్ నిర్మాణం పావడం తో వర్షాలు వచ్చినప్పుడు ఆ నీరు పొంగి ప్రవహించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయనీ, దీనివల్ల నీరు కలుషి తమై తాగునీటిలో కలవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడు తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనికి వెంటనే స్పందిస్తూ ఇలా ఎందుకు జరుగుతుందో తగిన చర్యలు తీసుకోవాలని వెంటనే సభ్యులు చెప్పిన సమస్యను పరిష్క రించి తనకు త్వరలోనే నివేదిక ఇవ్వాలనీ, ప్రజలకు అందు బాటులో ఉండి ఈ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ విస్రృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రతి ఇంటి వద్ద శానిటేషన్ నిర్వ హించాలని అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఇప్పటికే ప్రతి కాలనీలో శానిటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామనీ, దీన్ని ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. అలాగే మరికొన్ని కాలనీల్లో వీధిలైట్లు, ట్రాన్స్ఫార్మర్, డ్రెయినేజీ వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆయన అధికారు లతో ఎక్కడైతే ఈ సమస్యలు ఉన్నాయో పూర్తిచేసి అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనీ, ఎక్క డా అలసత్వం వహించరాదని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో ప్రజ లు కూడా ప్రభుత్వాదేశాలను పాటిస్తూ ఎంతో అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దనీ, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంద న్నారు. ఏదైనా సమస్య ఉంటే కంట్రోల్ రూం నెంబర్ 040 21111111 ఫోన్ చేసి సమస్యను పరిష్కరించుకో వచ్చుని తెలిపారు. ఈ నెంబర్కి ఫోన్ చేయడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే సూచనలు. సలహాలు కూడా తీసుకోవచ్చని తెలిపారు. అలాగే కరోనా వైరస్ లక్షణాలు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మెడికల్ కిట్స్ కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎల్లy ేళలా తాము అందుబాటులో ఉంటామనీ, ఏ క్షణంలోనైనా మీరు ఫోన్ చేయొచ్చని కార్పొరేటర్ కార్యాలయంలో కూడా మెడికల్ కిట్స్ అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు.