Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
నగరంలో అనేక ప్రయివేటు హాస్పిటల్స్ కోవిడ్ మహ మ్మారిని అవకాశంగా మార్చికుని ప్రజల నుంచి అధిక ఫీజు లు వసూలు చేస్తున్నారనీ, పేద, మధ్య తరగతి వర్గ ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడం ప్రయివేటు ఆస్పత్రుల యా జమాన్యాలకు తగదనీ, వెంటనే ప్రయివేటు హాస్పిటల్స్‌ను కట్టడి చేసి ప్రభత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని టీపీ సీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలంతా ప్రభుత్వాస్పత్రులకు వెళ్లండి, ప్రయిy ేటు హాస్పిటల్స్‌కి వెళ్లొద్దని సీఎం పిలుపునిచ్చారనీ, ఇది తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గు చేటని తెలిపారు. కేసీఆర్ ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా జిల్లాకి వెయ్యి పడకల హాస్పిటల్, నియోజకవర్గ కేంద్రానికి 100 పడకల హాస్పిట ల్ను ఏర్పాటు చేస్తామని గతంలోనే చెప్పారనీ, ఏడేండ్లయి నా అమలును నోచుకోలేదని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు ఉంటే ప్రజలు ప్రయివేటుకు వెళ్లాల్సిన అవస రం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యా లు, సరిపడా బెడ్లు లేనందుకే ప్రజలందరూ ప్రయివేటుకు వెళ్తున్నారనీ, ఈ వైఫల్యానికి పూర్తి బాధత్య రాష్ట్ర ప్రభత్వం వహించాలని పేర్కొన్నారు. వెంటనే ప్రయివేటు హాస్పిటల్స్ ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసు కుని సామాన్య ప్రజలకు బెడ్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో అనేక ప్రయివేటు హాస్పిటల్స్‌లో ఆక్సిజ న్ మాములు సమయాల్లో రూ. 3, 4 వేల మధ్య ఉంటుందనీ, ఇపుడు రూ.30 నుంచి రూ.40 వేల దాకా తీసుకుంటున్నారని తెలిపారు. మా ములుగా దొరకాల్సిన ఇంజక్షన్లకు కూడా ఎక్కువ ఖర్చు అవుతుందనీ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యం నిమిత్తం అనేక దేశాల ప్రజలు హైదరాబాద్‌కు వస్తుంటారని తెలి పారు. మెడికల్ హబ్‌గా పేరు గాంచిన హైదరాబాద్‌లో తయారైన రెమెడిసివర్ ఇంజెక్షన్లు హైద్రాబాద్ ప్రజలకు అందుబా టులో లేవనీ, రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేకపో వడం వల్ల తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలా జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా స్పందించి పక్క రాష్టం లో చేసిన విధంగా కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలను ఆదుకోవాలని కోరారు.