Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌ న్ను పగడ్భందీగా అమలు చేస్తున్నామని మల్కాజిగిరి డీసీపీ రక్షితా మూర్తి తెలిపారు. మంగళవారం నేరేడ్మెట్ చౌరస్తాలో ఉదయం 6 గంట ల నుంచి 10 గంటల వరకు ఇచ్చిన సడలింపును పరిశీలించి జనం గుంపులు గుంపులుగా ఉండకుండా భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లాక్డౌన్ తర్వాత అన్ని రహదారులను దిగ్బంధం చేసి, ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి, పాసులు ఉన్న వాహనాలనే అనుమతించాలని పోలీసులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు.