Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
లాక్‌డౌన్‌తో అధికారుల పర్యవేక్షణ ఉండదనీ, మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో పుట్ట గొడుగుల్లా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా యనీ, నిర్వాహకులపై చర్యలు తీసుకుని నిర్మాణాలను కూల్చేయాలని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ మంగళవారం డిప్యూటీ కమిషనర్ దశరథ్కు వినతిపత్రం అందజేసి సమస్యలను వివరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనంద్ బాగ్‌లోని ఏడీఆర్ హాస్టల్‌పై నిర్మిస్తున్న అదనపు ఫ్లోర్, సఫిల్‌గూడ చౌరస్తాలో జైన్ బిల్డర్ ఫుట్‌పాత్‌ను ఆక్రమించి నిర్మాణాలు జరుపుతున్నారనీ, అందులో ప్రభుత్వ స్థలం కూడా ఉందనీ, వీటిన్నింటినీ వెంటనే కూల్చేయాలనీ, లేని పక్షంలో సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ముదిరాజ్, రామకృష్ణ, సదానందంగౌడ్, గణ, ప్రకాష్, చందు, రాకేష్, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.