Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
ఫీవర్ సర్వేకి ప్రతి ఒక్కరూ సహకరించాలని అంబర్‌పేట టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం గోల్నాక డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ వైద్య సిబ్బందితో కలిసి ఇంటింటి సర్వే నిర్వహించి స్వల్ప అనారోగ్యానికి గురైన వారికి మందులు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు నర్సింగ్ యాదవ్, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారోత్సవాన్నిఅడ్డుకుంటాం
మేకల రాములు యాదవ్
నవతెలంగాణ-కల్చరల్
గొల్ల కురుమల ఆరాధ్యదైవం, కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మెన్ పదవి, గొల్ల కురుమలకు కేటాయించకుంటే డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవాన్ని అడ్డుకుంటామని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ హెచ్చ రించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మెన్ అవకాశాన్ని ఎప్పటికీ యాదవులకే కల్పిస్తామని గతంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం చైర్మెన్ పదవిలో యాదవులను మాత్రమే నియమించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన అనుచ రులకు చైర్మెన్ పదవి కట్టబెట్టాలని చూస్తు న్నారని అన్నారు. పదవి విషయంలో ముత్తిరెడ్డి జోక్యం చేసుకోవడం తగదన్నారు. యాదవ ప్రజా ప్రతినిధులు, మంత్రులు చొరవ తీసుకొని కొమురవెల్లి చైర్మెన్ పదవి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి యాదవులకు న్యాయం చేయాలని కోరారు