Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించడంలో భాగంగా, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్లో స్థానిక శాసనసభ సభ్యులు, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్ ఆదేశాలతో డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీిఆర్ చేెపట్టినటువంటి, సర్వే సత్ఫలితాలను ఇస్తుందని ఈ సర్వేలో భాగంగా కరోనా లక్షణాలు ఉన్న ప్రతి వ్యక్తికీి హెల్త్ కిట్ ఇవడం జరుగుతుందన్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను ఏపటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుందని, తద్వారా కరోనాని మొదటి దశలోనే అరికట్టగలుగుతున్నామని, కరోనా టెస్టులకోసం వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని జిల్లా గణేష్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న సర్వేను కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తుందని గుర్తుచేశారు. అనవసరంగా ప్రయివేటు హాస్పిటల్‌ను సంప్రదించి, డబ్బులను వధా చేసుకోవద్దని ,ప్రభుత్వ హాస్పటలల్లో అన్ని విధాలా సదుపాయాలు ఉన్నాయని, భయబ్రాంతులకు గురి కావద్దని నిర్భయంగా ప్రభుత్వ సేవలను వినియోగించుకొని కరోనాను అరికట్టడంలో అందరూ భాగస్వామ్యులు అవ్వాలని జిల్లా గణేష్ తెలిపారు.