Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
రెజిమెంటల్ బజార్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు క్రిష్టఫర్ (55) కరోనాతో బాధపడుతూ సోమవారం రాత్రి కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కరోనా తగ్గినా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ మాత్రం అలాగే ఉండిపోయింది. దీంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి సోమవారం రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందారు. క్రిష్టఫర్ క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ కొన్నిల్ మెంబర్‌గా, సెయింట్ మేరీస్ బసలికా చర్చ్ ప్యారిస్ కౌన్సిల్ మెంబర్‌గా కూడా కొనసాగుతున్నారు ఆయనకు భార్య సోఫియా, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దాదాపు 25 ఏండ్లుగా ఆయన కాంగ్రెస్‌లో చురుకైన కార్యకర్తగా పని చేస్తూ వస్తున్నారు. క్రిష్ణపర్ గతేడాది లాక్డౌన్ సమయంలో పేదలకు తన వంతుగా నిత్యావసర వస్తువులు సైతం పంపిణీ చేశారు. మాజీ కార్పొలేటర్ వసంత యాదవ్, కాంగ్రెస్ నాయకులు నర్సింగ్‌రావు, జూడ్పాల్, వేణు, కృష్ణారెడ్డి, రమీష్లు క్రిష్టపర్ మృతదేహాన్ని సందర్శించి నివాళ్లర్పించారు.