Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ స్వామి దుకాణదారులకు సూచించారు. మంగళవారం అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో లాక్ డౌన్ సడలింపు సమయంలో కిరాణా స్టోర్స్, హౌటల్స్, వివిధ వ్యాపార సముదాయాల నిర్వాహకులకు కోవిడ్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరింలన్నారు. దుకాణాలకు వచ్చే వినియోగదారులు తప్పకుండా కనీసం రెండు మీటర్ల దూరం పాటించే విధంగా దుకాణదారులు వినియోగదా రులకు తెలియజేయాలని సూచించారు. వ్యాపార నిర్వా హకులు తప్పనిసరిగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే వ్యాపారాలను కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జానకి రామిరెడ్డి, పోలీ సు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.