Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ఈ నెల 10వ తేదీన హను మాన్ టెక్డి నాకోడ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన తెలిసిందే. మంగళవారం గోషామహల్ జీహెచ్ఎంసీ సర్కిల్ -14 డిప్యూటీ సిటీ ప్లానర్ (డీసీపీ) శ్రీనివాస్ యాదవ్ అక్రమ కట్టడాలను పరిశీలించారు. అక్రమంగా నాకోడ కాంప్లెక్స్ లో 32 షాపులను నిర్మించిన తీరును పరిశీలించారు. నిబంధనలు పాటించని వారిపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు తీసుకుంటుందని బాధితులకు హామీనిచ్చారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ ఆశ్రరు ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పిఎస్కె శెట్టి బృందం జీహెచ్ఎంసీ డీసీపీకి కాంప్లెక్స్ ప్లాన్ మ్యాప్ చూపించారు. దాన్ని పరిశీలించి అక్రమార్కులపై చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి, టీఆర్ఎస్ ఇన్చార్జి ఆర్వి మహేందర్ కుమార్ పాల్గొన్నారు.