Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
పేదింటి ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ జిల్లా తూమ్కుంట మున్సిపల్ కార్యాలయంలో చైర్మెన్ కారంగుల రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో 25 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. అనంతరం మంతి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో అవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని సూచించారు. ప్రాణాలకంటే ఏది ఎక్కువ కాదని, అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తేనే కరోనా కట్టడి చేయవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ వాణి వీరారెడ్డి, కౌన్సిలర్లు రాజు యాదవ్, నర్సింగ్ రావు గౌడ్, నర్సింగ్ రావు, యాదమ్మ నర్సింగ్ రావు గౌడ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, మాజీ సర్పంచ్ గోల్డ్ శ్రీనివాస్ ముదిరాజ్, ఆంజనేయులు, వేణు గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.