Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు సూచించారు. మంగళవారం పీస్ వెల్ఫేర్ సొసైటీ, నిర్మాణ్ పుణ్యభూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ అంబులెన్స్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరికైనా అంబులెన్సు అత్యవసరమైనా, ఆరోగ్య సమస్యలున్నా 9985345108 నెంబర్‌కు ఫోన్ చేసి పలు అనుమానాలు నివత్తి చేసుకోవాలని సూచించారు. ఉచిత అంబులెన్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థ సభ్యులకు ఈసందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతల రవికుమార్ గుప్తా, శివ ప్రకాష్, సంస్థ సభ్యులు డాక్టర్ బొగ్గు సురేష్, వేణుగోపాల్ రావు, శ్రీనివాస్ కాజా, కిషోర్, వెంకట సుబ్బారెడ్డి, రామకృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.