Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం
ఎల్బీనగర్లోని జోనల్ కార్యాలయం కృష్ణవేణినగర్లో 90 బెడ్స్తో అన్ని వసతులతో ఓజోన్ హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించారు. హయత్నగర్, ఎల్బీనగర్, సరూర్నగర్ సర్కిల్ పరిధిలోని ప్రజలు పాజిటివ్ వచ్చి ఇరుకు గదుల్లో ఉండలేక ఇబ్బంది పడుతున్నవారు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతీరోజు భోజనం, టీ, టిఫిన్ ఇస్తామని, ఆక్సిజన్, డాక్టర్స్ పర్యవేక్షణలో ఐసోలేషన్ పనిచేస్తుందన్నారు. దీనికి సంబంధించి డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి, కృష్ణయ్య, మారుతీ దివాకర్ అన్ని వసతులను ఏర్పాటు చేశారన్నారు. కరోనా బాధితులు 7075948108 ఫోన్నంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు.