Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
కోవిడ్ బాధితులు, వలస కార్మికులకు పౌష్టికాహారాన్ని అందజేయడానికి వెళ్తున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని అడ్డుకోవడం దారుణమని, విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి హేయమైన చర్యలు చేపట్టడం టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లుతుందనిని హస్తినాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దెంది శశిధర్ రెడ్డి అన్నారు. బుధవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు సాయం చేయడానికి వెళ్తున్న ఎంపీ రేవంత్‌రెడ్డిని అడ్డుకోవడం దారుణమన్నారు. అధికారంలో లేకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడుతుందన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ప్రజలకోసం సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు. డివిజన్లో పారిశుధ్య పనులు, డ్రెయినే వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. స్థానిక కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోకుండా రాజకీయాలు చేయడం సరికాదన్నారు. హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు.