Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బడంగ్పేట్ మేయర్ పారిజాత నర్సింహ్మ రెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
కరోనా నియంత్రణకు ప్రజలు, అధికారులు అందరూ సహకరించాలని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మ రెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్‌పేట్‌లోని కార్యాలయంలో శానిటేషన్ సిబ్బందికి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసే పరికరాలను డిప్యూటీ మేయర్ ఇబ్రం శేఖర్‌తో కలిసి అందజేశారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలో ఎప్పటికప్పుడు పిచికారీ చేయాలని సిబ్బందికి సూచించారు. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని లాక్‌డౌన్‌కి సహకరించాలని కోరారు. ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట శ్రీధర్ రెడ్డి, సుర్ణగంటి అర్జున్, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, ఇంద్రసేన, నాయకులు రంగారెడ్డి జిల్లా సపోర్ట్ సెల్ కన్వీనర్ రామిడి శూరకర్ణ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.