Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
రాష్ట్రంలో రెండో దశ కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు, వారికి మనోధైర్యం కల్పించే బాధ్యత డాక్టర్లపై అధికంగా ఉందని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం పీర్జాదిగూడ నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రయివేటు హస్పిటల్స్ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వైరస్ బారిన పడిన వారికి అందిస్తున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. రెమిడెసివిర్ ఇంజక్షన్ కొరత కారణంగా అనేక మంది చాలా ఇబ్బందులపడుతున్నారన్నారు. రెమిడెసివిర్ ఇంజక్షన్లను ఎమ్మార్పీ ధరలకే అందించేలా తగిన ఏర్పాటు చేస్తామని హెట్రో డ్రగ్స్ ప్రతినిధులు వివరించారు. సమావేశంలో కార్పొరేషన్ మేనేజర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.