Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ ఇన్స్పెక్టర్ మతిన్
నవతెలంగాణ-మల్కాజిగిరి
ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే సహించేది లేదని మల్కాజిగిరి రెవెన్యూ ఇన్స్పెక్టర్ మతిన్ అన్నారు. మంగళవారం దీన్ దయాల్ నగర్లోని 315 సర్వే నెంబర్లో ఓ వ్యక్తి కబ్జాకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు అందడంతో, అక్కడికి చేరుకుని అక్రమనిర్మాణాలను కూల్చివేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు, వక్ఫ్ భూములు, చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేసి ఆవ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. గతంలో ఇదే సర్వేనెంబర్లో జరిగిన అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భూ కబ్జాదారులు ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్నప్పుడు స్థానికులు సమాచారం అందించాలని ఆయన కోరారు.