Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
లాక్డౌన్లో ఉపాధి లేక అష్టకష్టాలు పడుతున్న నిరుపేద ప్రజలను ఆదుకునేందుకు ఎస్ఆర్ఐ వాసవి అసోసియేషన్ స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చింది. గురువారం వాసవి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల రవి పంపిణీ చేశారు. పేద ప్రజలకు సేవ చేయడంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేనిదని, ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా సాయం అందించాలన్నారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలకు సేవ చేసే గుణాన్ని అలవర్చుకోవాలని కోరారు.అసోసియేషన్ అధ్యక్షులు రాయిని హరి, ఉపాధ్యక్షులు పందిరి శ్రీనివాసరావు, కోశాధికారి కరుమూరి దినకర్, కోవిడ్ రెస్పాన్స్ టీం ప్రతినిధులు లక్ష్మణ్, స్వామి, చంద్రికా, మోహిత్, కిరణ్, యశ్వంత్, నేతి రాజీవ్‌తో సంస్థ వాలంటీర్లు పాల్గొన్నారు.